1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 2898 candidates will contest in telangana election

తెలంగాణా ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో 2898 మంది

telangana assembly poll
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 2898 మంది అభ్యర్థులు బరిలో నిలించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 4798 మంది నామినేషేన్లు దాఖలు చేశారు. 
 
సోమవారం నుంచి జరిగిన స్క్రూటినీలో 608 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా ముఖ్యమంత్రి, భారాసా అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఆ తర్వాత మేడ్చల్ స్థానంలో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది, కొండగల్‌లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణ పేట నుంచి కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. 
తర్వాతి కథనం
కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?