గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (18:54 IST)

కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

monkey
కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గాంధీనగర్ జిల్లాలో సల్కీ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో దీపక్ ఠాకూర్ (10) అనే చిన్నారి సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. 
 
అదే సమయంలోఅక్కడికి వచ్చిన కోతి అతనిపై దాడి చేసింది. కోతి దాడితో చిన్నారి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. దీంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా ఈ గ్రామంలో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయని అవి తరచూ స్థానికులపై దాడికి పాల్పడుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వారంలో ఇది నాలుగవ ఘటనని స్థానికులు చెప్తున్నారు.