గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (08:55 IST)

వైద్యుడి నిర్లక్ష్యం : ఐదేళ్లుగా పొట్టలో కత్తితో యువకుడు

knife in stomach
ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ యువకుడి పొట్టలో కత్తి ఒకటి ఐదేళ్లుగా ఉండిపోయింది. ఈ ఐదేళ్లపాటు ఆ యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో నరక యాతన అనుభవించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ జిల్లా అంకాలేశ్వరర్‌కు చెందిన అతుల్ గిరీ అనే యువకుడు ఐదేళ్ళ క్రితం కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో భరూచ్‌లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. అంతా బాగుందని చెప్పి, ఇంటికి పంపించారు. 
 
ఆ తర్వాత నుంచి క్రమంగా అతుల్‌కు కడుపు నొప్పి ప్రారంభమైంది. దీంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగసాగాడు. ఐదేళ్ల తర్వాత ఇటీవల అతను ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఐదేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులకు చెప్పాడు. దీంతో వైద్యులు అతనికి ఎక్స్‌రే తీయగా, అతని కడుపులో కత్తి ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా ఆ కత్తిని బయటకు తీశారు. దీంతో అతుల్ ఊపిరిపీల్చుకున్నాడు.