గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (14:41 IST)

ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారా... అయితే, కరోనా ప్రభావమే : ఆరోగ్య మంత్రి

Mansukh Mandaviya
ఇటీవలికాలంలో చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న యువకులు గుండెపోటుతో మరణించారు. ఇలా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర మంత్రి మాన్సుక్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా బారిన పడిన చరిత్ర ఉందన్నారు. అతిగా శ్రమించడానికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన గుజరాతీ మీడియాతో మాట్లాడుతూ, ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినవారు, ఆ ర్వాత రెండేళ్ల వరకు ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. అపుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు' అని అన్నారు. గార్భా నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం వెనుక అధిక శ్రమ కారణమని ఆయన చెప్పకనే చెప్పారు.