1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Big twist in tspsc paper leak case

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. మరో కొత్త ట్విస్ట్.. ఏంటది?

Paper leak
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. 
 
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు. కానీ ఈ వ్యవహారంలో ప్రవీణ్, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ఉన్నతాధికారులకు చెప్తురామేనని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్‌లను ప్రలోభ పెట్టారు.  
 
కాగా షమీమ్, రమేష్‌ల నుండే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కు చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు ఐదు రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనితో బుధవారం చంచల్ గూడ జైలు నుండి ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా: మే 10న పోలింగ్, మే 13న ఫలితాలు