1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 29 మార్చి 2023 (14:03 IST)

మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం: 40మంది వలస జీవులు మృతి

fire
మెక్సికో నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 40 మంది వలసజీవులు మృత్యువాత పడ్డారు. అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో అనేక మంది క్షతగాత్రులయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో శిబిరంలో మంటలు అంటుకున్నాయి. 
 
ప్రమాదం జరిగే సమయానికి దక్షిణ, సెంట్రల్‌ అమెరికాకి చెందిన మొత్తం 68 మంది శిబిరంలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వలసదారుల శిబిరంలో ప్రమాదం జరిగిన వెంటనే భారీగా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు.