ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (14:54 IST)

బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నా: కోర్టు నుంచి అనుమతి

bandi sanjay
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా మహాధర్నాకు పోలీస్‌లు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కోర్టు నుంచి అనుమతి ఇచ్చింది. మహాధర్నాకు పోలీస్‌లు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కోర్టు నుంచి అనుమతి తెచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది. 
 
అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా పేరిట దీక్ష చేపట్టనున్నారు. 
 
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించనున్నారు.