1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (09:27 IST)

బెడిసికొట్టిన అక్రమ సంబంధం.. విద్యార్థి ఆత్మహత్య

suicide
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో అక్రమ సంబంధం బెడిసికొట్టింది. దీంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కుకునూరు పల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్ (19) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. ఈ విద్యార్థి హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉంటున్న ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ గత కొన్ని రోజులుగా మరో వ్యక్తితో చనవుగా ఉండటాన్ని గమనించిన అభిషేక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తన సొంతూరుకు వెళ్లిన అభిషేక్.. మంగోల్‌లోని పొలం వద్ద పురుగుల మందు సేవించాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.