శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (17:59 IST)

పరీక్ష రాస్తుండగా విద్యార్థిని గుండెపోటు.. సీపీఆర్ ప్రాణాలు నిలబెట్టిన సిబ్బంది

exam
తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థిని పరీక్ష రాస్తుండగా గుండెపోటుకు గురైంది. దీంతో సిబ్బంది ఆ బాలికకు సీపీఆర్ నిర్వహించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. పాలమూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 
 
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఈ పరీక్ష రాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షణాల్లో పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది ఆ విద్యార్థినికి సీపీఆర్ పరీక్ష చేసి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకలడగా ఉంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో అనేక మంది టీనేజీ యువతీయువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటిదాగా అల్లాసంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లేలేపు వారు ప్రాణాలు కోల్పోతున్నారు.