మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (12:39 IST)

మూడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి.. లైంగిక దాడి.. తీవ్ర రక్తస్రావం కావడంతో..?

మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా సిరిసిల్ల పట్ణణంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని పైశాచికత్వానికి చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఆదివారం ఎదురింటి మూడేళ్ల పసిపాప ఆడుకుంటూ కనిపించింది. ఆ పాపకు చాక్లెట్ ఆశ చూపాడు. 
 
చిన్నారి చాక్లెట్ ఆశతో అతడి ఇంట్లోకి వెళ్లింది. చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లినా కామాంధుడు.. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటకు వచ్చింది. తల్లిదండ్రులు ఏమైందని అడగగా.. ఆ చిన్నారి ఏడుస్తూనే ఉండిపోయింది. అయితే బాలికకు తీవ్ర రక్తస్రావం జరగడం ఆమె తల్లిదండ్రులు గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించారు.
 
దీంతో ఈ దారుణ ఘటనపై బాలిక తల్లిదండ్రులు.. సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నింధితునికి భార్య, ఎనిమిదేళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు.