గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (12:16 IST)

కొంపముంచుతున్న ఆ‌న్‌లైన్ గేమ్‌లు.. పబ్జీతో బాలుడి మృతి

ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా యువత ఆన్ లైన్ గేమ్‌ల ద్వారా సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు.. మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తాజాగా పబ్జి గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. మంగళూరులో తప్పిపోయిన 13ఏండ్ల అకీఫ్ చనిపోయి కనపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతి చెందిన బాలుడికి, నిందితుడుకి మధ్య పబ్జి గేమ్ కారణంగా గొడవలు వచ్చాయి. 
 
అకీఫ్ ఎప్పుడూ గేమ్ లో గెలుస్తుండేవాడు. అకీఫ్‌కు నిందితుడితో ఓ మొబైల్ స్టోర్‌లో పరిచయం ఏర్పడింది. దీంతోవారు రెగ్యులర్‌గా గేమ్ ఆడేవారు. అలా ఆడిన ప్రతీసారి అకీఫ్ గెలుస్తుండేవాడు. దీంతో అకీఫ్ తరఫున ఎవరో ఆడుతున్నారని నిందితుడు అనుమానించాడు. 
 
అకీఫ్ ఇద్దరం కలిసి ఒకే దగ్గర కూర్చొని ఆడుదాం అని ఛాలెంజ్ చేశాడు. వారిద్దరూ శనివారం రాత్రి కూర్చొని ఆడగా.. అకీఫ్ ఓడిపోయాడు. ఇద్దరి మధ్య వాదన జరగ్గా.. అకీఫ్ నిందితుడిపై రాళ్లు విసిరాడు. నిందుతుడు కూడా పెద్ద రాయితో అకీఫ్ ను కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారని సీపీ శశి కుమార్ తెలిపారు.