గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (11:10 IST)

పుట్టలు పెట్టిన చీమలు.. ఓ టెక్కీ ప్రాణాలు తీశాయి.. ఎలాగంటే?

చాలా పెద్దదైన, బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి చంపబడునట్లుగానే అనే సుమతి శతకం పద్యం అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఇక్కడ ఓ టెక్కీ చీమల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో పుట్టలు.. పుట్టలు పెట్టిన చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం స్ట్రీటుకు చెందిన సత్యమార్తి దంపతులు నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు సంగీత షోలింగనల్లూరులోని ఒక ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు.
 
ఈ క్రమంలో వారి ఇంటి నిండా చీమలు పుట్టలు పెట్టాయి. ఇంట్లో ఉండే అన్ని పదార్థాల్లోను చీమలు పేరుకుపోయి ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూసినా చీమలు. దీంతో సంగీతకు చికాకు వచ్చేసింది. ఎన్నో చీమల మందులు వాడింది. అయినా ఇంట్లో చీమలు తగ్గలేదు. దీంతో ఆమెకు ఇరిటేషన్‌కు గురైంది.
 
ఈ క్రమంలో సంగీత తల్లి సహాయంతో చీమలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. చీమలు చెల్లాచెదురుగా పారిపోతుంటే సంగీత వాటిపై కూడా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది.ఈ క్రమంలో ఆ మంటలు సంగీత బట్టలకు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి ఒళ్లంతా పాకాయి.
 
తల్లి కూతురుకి అంటుకున్న బట్టలు ఆర్పటానికి తీవ్రంగా యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. మంటల్లో నిలువునా కాలిపోయిన సంగీత తల్లి కళ్లముందే సజీవదహనం అయిపోతుంటే ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. పెద్ద పెద్దగా కేకలు వేసింది. మంటలు ఆర్పటానికి యత్నించింది. ఆమె కేకలకు వేరే గదిలో ఉన్న తండ్రీ సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు.
 
కళ్లముందే కొనఊపిరితో కొట్టుకుంటున్న సంగీతన పొరుగువారి సహాయంత ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతు ఆదివారం సాయంత్రం సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా కూతుర్ని రక్షించే యత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలవ్వటంతో ఆమె చికిత్స పొందుతోంది.