శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:37 IST)

యూపీ: ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్... ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలిక సామూహిక అత్యాచారానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. తన సూసైడ్ నోట్‌లో నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఇందులో ఇద్దరు పక్క గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. సూసైడ్ లేఖలో తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలిపిందన్నారు. ఈ లేఖ ఆధారంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్‌కు అనంతరం ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులతో విషయం చెప్పిందని.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పుకొచ్చారు.