1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Aishwarya Rajesh comments on cinema chances

మెచ్చుకుంటారు కానీ... ఛాన్సులు ఇవ్వరు.. అందుకే..? ఐశ్వర్యా రాజేష్

Aishwarya Rajesh
ఐశ్వర్య రాజేష్ దక్షిణాది హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె బ్లాక్ బ్యూటీ అయినా ఐశ్వర్య పలు చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఐశ్వర్యా రాజేష్ కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ప్రముఖ హీరోలతో సినిమాల్లో నటించడం లేదని ఓపెన్‌గా మాట్లాడింది. తమిళ సినిమాల్లో చాలా రోల్స్ తనకు గుర్తింపును సంపాదించి పెట్చాయి. చాలామంది నటీనటులు తనను మెచ్చుకున్నారు.. కానీ ఎవరూ తమ సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇవ్వలేదు. 
 
తన నటనను మెచ్చిన ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ నటులు తప్ప, ఇతరులు తనకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పింది. 15కి పైగా హీరోయిన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా.. అగ్రహీరోలు తనకు హీరోయిన్‌గా అవకాశాలు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు. 
 
అందుకే కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. తనకంటూ అభిమానులు వున్నారని... అదే తనకు చాలా సంతోషం అంటూ ఐశ్వర్య రాజేష్ తెలిపింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సినిమాని బట్టి సంగీతం ఉంటుంది, ట్రోల్స్ పట్టించుకోను : సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్