''చిత్రాంగద''గా మళ్లీ భయపెట్టనున్న అంజలి.. అమ్మడు పాటే హైలైట్!
అంజలి ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని
అంజలి ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్నిఅనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుని జులై తొలి వారంలో విడుదలకు సిద్ధమౌతున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతోనే ఈ చిత్రం కొద్ది రోజుల్లో సెన్సార్ కూడా జరుపుకోనుందని సినీపండితులు అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో కథానాయిక అంజలి ఓ పాట పాడటం విశేషం. డ...డ..డాంగ్...డాంగ్.. డంగ్ చుక్.. డంగ్ చుక్... యాపిల్ ఫోన్.. యాపిల్ రేటుకు వస్తే.. ఆషాడం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే అంటూ అంజలి ఆలపించిన పాట ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని దర్శకనిర్మాతలు అంటున్నారు.
గతంలో అంజలి నటించిన ''గీతాంజలి'' హారర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దీని తరువాత మళ్లీ అంజలి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ దెయ్యం గెటప్‌లో మళ్లీ అందరిని భయపెట్టడానికి రానుందన మాట.
