సంబంధిత వార్తలు
- NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్
- Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?
- Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల
- NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి
- Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే
Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?
Devara, salar, kalki posters
తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా సైన్స్ ఫిక్షన్ మూవీగా గ్రాఫిక్స్‌తో మాయ చేశాడు. అసలు ఆ సినిమా విడుదలకుముందు విడుదలవుతుందో లేదోనని అనిపించింది. అశ్వనీదత్ గారు ప్రోత్సాహంతో ముందుకు సాగామని అన్నారు. సక్సెస్ తర్వాత ఈ చిత్రం పూర్తిగా కల్పితమనీ, పురాణాలను చెప్పేవారెవరినీ సంప్రదించకుండానే సినిమా చేశానని ఘంటాపథంగా చెప్పారు. ఆ తర్వాత కల్కి 2 గురించి చెబుతూ, దానికి సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంగా కల్కి 2 చిత్రం రిలీజ్ కావాలంటే 3-4 గ్రహాలు అనుకూలించాలన్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7-8 అనుకూలించాలి అని నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో సెటైరిక్ గా మాట్లాడారు.
ఇదిలా వుండగా, ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు, సలార్ 2, దేవర2 సినిమాలకు కూడా గ్రహాలు అనుకూలించాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాణ సంస్థలు కొంచెంది ఫైనాన్సియల్ ట్రబుల్ లో వున్నాయని విశ్వసనీయ సమాచారం. కనుక ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్స్ సెట్ పైకి వెళ్ళకపోవచ్చని రూఢీ అవుతోంది. నాగ్ అశ్విన్ ఒక్కడే చాలా తెలివిగా గ్రహాలపై నెట్టేసి ఇప్పట్లో సీక్వెల్ అయ్యేట్లు లేదని చెప్పేశారు.
