బుధవారం, 23 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (19:33 IST)

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

Pawan kalyan
Pawan kalyan
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల, పవన్ కళ్యాణ్ డబ్బింగ్‌తో సహా మిగిలిన భాగాలను పూర్తి చేయడానికి సమయం కేటాయించినట్లు చిత్ర టీమ్ తెలియజేసింది. మే నెలాఖరు నాటికి సినిమా విడుదల కాగలదనే ఆశలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. లేదా సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజున విడుదలచేసే ఆలోచనకూడా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
కాగా, ఈ సినిమా రెండు పార్ట్ లుగా రూపొందుతోంది. మొదట క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించి, తరువాత జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా సంవత్సరాలుగా ఆలస్యాలను ఎదుర్కొంది, అభిమానులను నిరాశపరిచింది. 
 
ఇటీవలే ఒక ప్రధాన షెడ్యూల్ ముగిసింది. అది మొదటి పార్ట్ ది కాదనీ, రెండో భాగమని నివేదికలు తెలుపుతున్నాయి. ముంబైలో చివరి షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ విషయాన్ని సినిమా కాస్ట్యూమ్ డిజైనర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ కథనాల ద్వారా వెల్లడించారు. దానిని ఫాలో అయిన అభిమానులు మొదటి భాగాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లకు తీసుకురావడంపై దృష్టి సారించాలని మేకర్లను అభ్యర్థిస్తున్నారు. చాలా మంది త్వరలో అధికారిక విడుదల తేదీ కోసం ఆశిస్తున్నారు.
 
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ మద్దతుతో, హరి హర వీరమల్లు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.