బుధవారం, 23 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (15:26 IST)

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

Pawan kalyan
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై జనసైనికులు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌కు హాజరైన పవన్ కల్యాణ్.. ఆరోగ్యం సహకరించక పోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చేతికి సెలైన్ డ్రిప్‌తో కనిపించారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతోపాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే. పవన్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. పవన్ ఆరోగ్యం గురించి లెక్కచేయరని.. జాగ్రత్తగా వుండాలని కామెంట్ చేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గ్రహించిన అభిమానులు కంగారు పడుతున్నారు. 
 
అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వరుసగా అస్వస్థతకు గురి అవుతున్న నేపథ్యంలో అభిమానులు సినిమాలు రాజకీయాలు పక్కనపెట్టి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలంటూ రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పరమేశ్వరుడి ఒడిలో పవన్ పడుకుని వున్నట్లు శివయ్య ఆయనను సముదాయిస్తున్నట్లు ఆ వీడియోలో వుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.