సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (13:27 IST)

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

babu - modi
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన 75వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎక్క్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడు  చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టిసారించి ఆయన పని చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పని చేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశ్నంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా" అని మోడీ పేర్కొన్నారు. 
 
అలాగే, సీఎం చంద్రబాబుకు వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నట్టు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 
 
దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... చిరంజీవి
 
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక సినీ రాజకీయ రంగ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెపుతున్నారు. చంద్రబాబుతో దిగిన ఓ అపరూప చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దూరదృష్ట కలిగిన నాయుకుడు దొరగడం తెలుగు ప్రజల అదృష్టమంటూ చంద్రబాబు సేవలను కొనియాడారు. 
 
జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు, దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న నాయకుడు మీరు. ఆ  అభగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే లలు నెరవేర్చే శక్తిని ప్రదర్శించాలని కోరుకుంటూ మీకు 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీలాంటి శ్రమించే, దాదర్శనికత కలిగిన, ఉత్సావహంతుడైన, నిబద్ధత కలిగిన నాయకుడు లభించడం తెలుగువారి అదృష్టం. మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నా అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.