పుష్పతో సుకుమార్ కాపీ డైరెక్టర్ గా మారిపోయాడా !
Srihari- alluarjun, alikhan
అదేవిధంగా భుజంపై ఫుష్ప గన్ పట్టుకునే విధానం కూడా తమిళ స్టార్ విజయకాంత్ హీరో గా వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలోని స్టయిల్ ను దించేశాడు. ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ నడవడిక ,ఆహార్యం పాత్ర తీరు తెన్నులు మొత్తం గా కాపీ చేసి పుష్ప రాజ్ పాత్ర గా మార్చాడు. కెప్టెన్ ప్రభాకర్ లో విలన్ పాత్రను పుష్ప లో హీరో పాత్రగా సుకుమార్ మార్చేశారు.
ఇదంతా ఒక భాగమైతే మరో విశేషం పుష్ప సినిమా కథ గురించి మరో వార్త బయటకు వచ్చింది. పుష్ప మూవీ నార్ కోస్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కథ తీసుకుని ఇండియన్ నేటివిటీగా సుకుమార్ మార్చేశాడట. సో. పెద్ద దర్శకులందరూ హాలీవుడ్ సినిమాలను కొరియన్ సినిమాలను కాపీ కొట్టేసి సక్సెస్ చేయాలని చూస్తున్నారనేది నిజమేనని తేలుతుంది.
