ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (09:40 IST)

మంచు మనోజ్‌ను ఎవరు కొట్టారు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్!

manchu manoj
హీరో మంచు మనోజ్ అలియాస్ మంచు మనోజ్ కుమార్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆయన 24 గంటల తర్వాత మరోమారు ఆస్పత్రికిరానున్నారు. మనోజ్‌కి వైద్యులు మెడికో లీగల్ కేసు పూర్తి చేశారు. మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనోజ్ ఇంటికి వెళ్లి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. 
 
కాగా, తనపై దాడి జరిగిందని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ఫ్రూవ్స్ కోసం మంచు మనోజ్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లినట్లుగా సన్నిహితులు చెబుతున్న విషయం తెల్సిందే. కాగా వైద్యులు ఇదే విషయాన్ని గుర్తించి మెడికో లీగల్ కేసుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సోమవారం ఆయన ఇంటికి వెళ్లి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. 
 
మెడికో లీగల్ కేసు అయితే మొదట పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆ ప్రకారం మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. బలమైన దెబ్బలు తగిలాయని.. దాడి చేసినట్లుగా ఉందని వైద్య నివేదికలో పేర్కొన్నారు.