ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (16:29 IST)

Manchu Manoj Vs Mohan Babu: మోహన్‌ బాబు, మనోజ్‌‌ల జగడం.. ఇదంతా ఆస్తుల కోసమేనా?

Manchu Manoj and Mohan Babu
Manchu Manoj and Mohan Babu
తండ్రీకొడుకులు మోహన్‌ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. 
 
మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
గాయాలతో పోలీస్ స్టేషన్‌ వచ్చి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారానికి తెర లేపారు. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
 
అయితే ఈ వార్తలపై మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదని మంచు ఆఫీసు క్లారిటీ ఇచ్చింది. ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని.. వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది. కానీ కొన్ని ఛానల్స్‌కు మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందని మనోజ్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. తన తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారని మనోజ్ ఆరోపించారని.. కచ్చితంగా ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.