ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (10:50 IST)

కూతురు కూతురు అంటూనే.. నా ప్రైవేట్ పార్ట్స్‌ను పిండేశాడు..

urfi javed
క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. చాలామంది ప్రముఖులు క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. శ్రీరెడ్డి లాంటి వారైతే క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఆర్బాటమే చేశారు. అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా లోబర్చుకోవడం సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అంశం.
 
తాజాగా హీరోయిన్ ఉర్ఫీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." ఆ డైరెక్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు. నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ ఆ డైరెక్టర్‌కి నాపై అలాంటి కోరికలు ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూతురు కూతురు అంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా నా ఒంటిపై చేయి వేస్తూనే ఉన్నారు. అంతే కాదు నా ప్రైవేట్ పార్ట్స్‌ని పిండేసేవాడు.
 
కానీ నేను ఏమీ అనలేకపోయాను. మగదిక్కు లేని నాకు సినిమాలు చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం చాలాఉంది. అందుకని ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి ధైర్యంగా మాపై ఇలా బిహేవ్ చేశారు అని చెప్తుంటే.. నేను కూడా ఇప్పుడు చెప్పడానికి ముందు అడుగు వేసాను" అంటూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.