సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:06 IST)

కోలీవుడ్ హీరోయిన్ ఓపెన్ ఆఫర్.. కథ నచ్చితే టాప్‌లెస్‌గా నటిస్తా...

కోలీవుడ్‌ హీరోయిన్ ఒకరు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కథ నచ్చితే టాప్‌ లెస్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆఫర్లు తగ్గిన హీరోయిన్లంతా ఈ తరహా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీరిలో బాలీవు

కోలీవుడ్‌ హీరోయిన్ ఒకరు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కథ నచ్చితే టాప్‌ లెస్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆఫర్లు తగ్గిన హీరోయిన్లంతా ఈ తరహా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీరిలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతి భాషకు చెందినవారున్నారు. ఇపుడు కోలీవుడ్ భామ కూడా చేరింది. ఇప్పటికే 50 చిత్రాలకుపైగా నటించిన ఈ సినియర్ హీరోయిన్ టాప్‌లెస్‌గా నటిస్తానని బహిరంగంగా ప్రకటించడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ కోలీవుడ్ హీరోయిన్ పేరు. సుజా వరూణి. తమిళ చిత్రం 'వర్ణజాలం'తో తెరకు పరిచయమైంది. ఐటమ్, అతిథి పాత్రలు ఎక్కువగా చేసింది. ఇప్పుడీ హీరోయిన్ మంచి కథల కోసం వెయిట్ చేస్తోందట. కథ నచ్చితే టాప్ లెస్ కూడా కనిపించడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఆఫర్‌ను దర్శక-నిర్మాతలు సీరియస్‌గా తీసుకుని, ఆమెకు తగిన కథలు తయారు చేయాల్సిందిగా కొందరు కథా రచయితలను కోరినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరు తయారు చేసే కథనచ్చాక సుజా రాణి అందాలు చూసే అదృష్టం ఏ దర్శకుడికి దక్కుతుందో వేచిచూడాల్సిందే.