చెస్ట్ చిన్నగా ఉండటంతో అవకాశాలు రాలేదు.. ఆ కామెంట్స్ విని బాధపడ్డా: ఇలియానా
ఏ హీరోయిన్ అయినా తన ఫిజిక్ గురించి పొగిడితే ఎగిరిగంతేస్తుంది. అయితే ఇలియానాకు మాత్రం ఎవరైనా ''మీరు చాల అందంగా ఉన్నారు'' అంటూ ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ తాను నమ్మనంటోంది. దీనికి కారణం తాను చిన్న
ఏ హీరోయిన్ అయినా తన ఫిజిక్ గురించి పొగిడితే ఎగిరిగంతేస్తుంది. అయితే ఇలియానాకు మాత్రం ఎవరైనా ''మీరు చాల అందంగా ఉన్నారు'' అంటూ ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ తాను నమ్మనంటోంది. దీనికి కారణం తాను చిన్నప్పటి నుంచి తనను తాను కొన్ని వేల సార్లు అద్దంలో చూసుకున్నానని తన ఫిజిక్ అంత బాగుండదు అని తనకు తెలుసు అని తనపై తానే కామెంట్స్ చేసుకుంది ఇలియానా. ''దేవదాస్'' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇలియానా కొంత కాలానికే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అగ్రహీరోలందరి సరసన నటించి మంచి పేరును సంపాదించుకుంది.
టాలీవుడ్‌లో అత్యంత పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా ఇలియానా రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ఈమెకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చి అక్కడకు వెళ్లిపోయింది. ఇలియానాను కూడా గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడంతో విసుకు చెందిన ఇలియానా టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ''బర్ఫీ'' లాంటి సినిమా దొరకడంతో తన సత్తాను చాటుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన "రుస్తుం'' చిత్రంలో నటించిన ఈ అమ్మడు మీడియాతో మాట్లాడింది.
ఈ సందర్భంగా తన గురించి పలు విమర్శలు వచ్చాయి అని, చివరకు తన చెస్ట్ చిన్నగా ఉంది అంటూ కూడా కొందరు విమర్శలు చేశారు. అవకాశాలు లేని సమయంలో ఏ కామెంట్స్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నేను కూడా అంతే అంటూ ఇలియానా వాపోయింది. తన శరీర ఆకృతి గురించి, చెస్ట్ గురించి కామెంట్స్ చేసిన సమయంలో తాను ఎంతో బాధపడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి గురించైనా కామెంట్స్ చేసేటప్పుడు బాగా ఆలోచించాల్సిందిగా ఇలియానా చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు ఇష్ట పడనివారు ఎదురైనా మొహమాటానికి నాలుగు మాటలు మాట్లాడవలసి వస్తోందని అలా మాట్లాడి కాకా పట్టకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఎవరూ ఎవరికీ అవకాశాలు ఇవ్వడం లేదని మనసులోని మాటను బయటపెట్టింది.

