1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. janatha garrage song, devisriprasad copy

జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్‌... తన పాటను తనే కాపీ కొట్టిన దేవీశ్రీ?

ఈ నెల 12వ తేదీన విడుదలైన జనతా గ్యారేజ్ పాటలు అతి తక్కువ టైంలో యమా క్రేజ్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కాపీ కొట్టాడని సినీజనం చర్చించుకుంటున్నారు. సహజంగా దేవీశ్రీ సినిమాలలో స్వరపర్చే బాణీలు గతంలో ఆయన స్వరపర్చిన ప

janatha garrage song
ఈ నెల 12వ తేదీన విడుదలైన జనతా గ్యారేజ్ పాటలు అతి తక్కువ టైంలో యమా క్రేజ్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కాపీ కొట్టాడని సినీజనం చర్చించుకుంటున్నారు. సహజంగా దేవీశ్రీ సినిమాలలో స్వరపర్చే బాణీలు గతంలో ఆయన స్వరపర్చిన పాటల మూసలోనే ఉంటాయని, ట్యూన్ వినగానే అది దేవిశ్రీ పాట అని సులువుగా చెప్పవచ్చునని సంగీత విమర్శకులు అంటుంటారు. అయితే  జనతా గ్యారేజ్ లో దేవీ స్వరపర్చిన టైటిల్ సాంగ్ లిరిక్స్ రామ్‌ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమా నుంచి తీసుకున్నారని పుకార్లు గుప్పుమంటున్నాయి. 
 
ఎవడు ఇంట్రవెల్ ఫైట్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవీ ట్యూన్స్‌ను కాపీ కొట్టి జనతా టైటిల్ సాంగ్‌గా మలిచాడని అంటున్నారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ పాటను, జనతా టైటిల్‌ సాంగ్‌ను పోల్చి చూస్తే ఈ విషయం నిజమేననిపిస్తోంది. సంగీత దర్శకులు ట్యూన్స్ కాపీ కొట్టడం కొత్తేమీ కాదు. కానీ ఎక్కడ నుంచి కాపీ కొట్టారనే విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దేవీ మాత్రం తాను సంగీత దర్శకుడిగా పనిచేసిన సినిమా నుంచే తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తర్వాతి కథనం
చనిపోయే పాత్ర చేయనున్న మెగా హీరో ఎవరు?