1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nayanthara to romance Rajinikanth for the fourth time

కబాలి డైరక్టర్‌తో రజనీ రెండో సినిమా.. అమలా పాల్ ఓకే.. డేట్స్ సర్దుబాటులో నయన

ప్రస్తుతం రజనీకాంత్ ''రోబో 2.0'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ధనుష్ ప్రొడక్షన్లో పా.రంజిత్ డైరక్షన్లో మరో సినిమాను చేయడానికి రంగం చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా క

Nayanthara
ప్రస్తుతం రజనీకాంత్ ''రోబో 2.0'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ధనుష్ ప్రొడక్షన్లో పా.రంజిత్ డైరక్షన్లో మరో సినిమాను చేయడానికి రంగం చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా కబాలి సీక్వెల్ కాదని రంజిత్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా అమలా పాల్‌ను అనుకున్నప్పటికీ.. మరో హీరోయిన్ హీరోయిన్ కోసం దర్శకనిర్మాతలు వెతుకులాట ప్రారంభిస్తున్నారు. 
 
కాగా మరో కథానాయికగా నయనతారను సంప్రదిస్తున్నారట. నయనతార వరుస సినిమాలతో చాలా బిజీగా వుంది. గతంలో రజనీకాంత్ సరసన నటించడంతో, ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆమె డేట్స్ సర్దుబాటు చేయవచ్చని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. 
 
ఒకవేళ ఏ కారణంగానైనా ఆమె చేయలేకపోతే, అప్పుడు త్రిషను తీసుకుందామనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మలయాళ భామ సూపర్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని వినియోగించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
తర్వాతి కథనం
పక్కా లోకల్.. కాజల్‌కు బాగా కలిసొచ్చింది.. హీరోయిన్‌గా వద్దు.. ఐటమ్ గర్ల్‌గా ముద్దు