1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:49 IST)

చిన్న సినిమా పెద్ద విజయం... బయ్యర్లు హ్యాపీ

తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు ఊహించని సక్సెస్‌లు సాధిస్తే.. ఇక ఆ నిర్మాతల సంతోషానికి అవధులుండవు. పరిమిత బడ్జెట్‌తో తీసి.. ఆ సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలా? అని ఆలోచిస్తూ.. ఓ వ్యక్తి ద్వారా సురేష్‌బాబు

తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు ఊహించని సక్సెస్‌లు సాధిస్తే.. ఇక ఆ నిర్మాతల సంతోషానికి అవధులుండవు. పరిమిత బడ్జెట్‌తో తీసి.. ఆ సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలా? అని ఆలోచిస్తూ.. ఓ వ్యక్తి ద్వారా సురేష్‌బాబును కలిసి ఆయన ప్రమోట్‌ చేసేలా ఘనత 'పెళ్లి చూపులు' టీమ్‌కే దక్కుతుంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం బాగా రన్‌ అవుతోంది. వెయ్యి రూపాయలకు 50 వేలు వచ్చినట్లుగా వుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారనీ, స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను కూడా వారు ఆనందంగా జరుపుకున్నారని నిర్మాతల్లో ఒకరైన రాజ్‌ కందుకూరు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్‌లో బాగా కనెక్ట్‌ అయిందనీ. ఏకంగా 1 మిలియన్‌ మార్క్‌‌లోకి   త్వరలోనే ప్రవేశించనుండటం చిత్ర యూనిట్‌ గర్వంగా ఫీలయ్యే విషయం. ఇది పెద్ద హీరోలకూడా లేదని చెబుతున్నారు. స్టార్‌ ఇమేజ్‌ కన్నా కథాబలం గొప్పదని నిరూపించిన చిత్రమిది. తాజా లెక్కల ప్రకారం 8.35 లక్షల డాలర్స్‌ (5.59 కోట్లు) అందుకుని, 1 మిలియన్‌ వైపుకు పరుగులు పెడుతోందని నిర్మాత తెలియజేస్తున్నాడు.