సంబంధిత వార్తలు
- షాక్ ఇవ్వబోతున్న నాగార్జున... అసలు ఏం జరిగింది..?
- మూడేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త... బెడ్ పై భార్యతో నిద్రిస్తున్న మరో యువకుడు...
- ఆ ముగ్గురు హీరోల దెబ్బకు రోజుకి 4 గంటలే నిద్రపోయిన పూజా హెగ్డే...
- క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
- అఖిల్‌కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్... రంగంలోకి దిగిన నాగార్జున..!
హరీష్ శంకర్‌కి షాక్ ఇచ్చిన పూజా హేగ్డే... టెన్షన్‌లో 'గబ్బర్ సింగ్' డైరెక్టర్
వరుణ్ తేజ్‌తో డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం వాల్మీకి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే... ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. అందుచేత ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించే పాత్రకు పూజా హేగ్డేను ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. ఈ పాత్ర చేయడానికి ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ప్రచారం జరిగింది.
ప్రచారంలో ఉన్న వార్తలపై హరీష్ శంకర్ స్పందించి అలాంటిదేమీ లేదని ఈ వార్తలను ఖండించారు. అయితే... ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ... డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేను అంటూ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఏం జరిగిందో అని... పూజా మాత్రం బాలీవుడ్‌లో చేయాల్సిన సినిమాలు ఉన్నాయి అందుచేత ఈ సినిమా చేయలేకపోతున్నాను అని చెప్పిందట.
పూజా ఇచ్చిన షాక్‌కి హరీష్ శంకర్ బాగా ఫీలయ్యాడట. ఆమె సక్సస్‌లో లేనప్పుడు దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తే.... ఇప్పుడు తనకు ఇలా షాక్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నాడట. చేసేదేం లేక వేరే హీరోయిన్ కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించాడట. పూజా వదిలేసిన పాత్రను ఏ హీరోయిన్ చేస్తుందో మరి?
