బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: బుధవారం, 8 మే 2019 (19:21 IST)

క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...

పాఠశాలలో కొన్ని తరగతులు నడవాలంటే సరిపడినంతమంది విద్యార్థులు వుండాలి. తగినంత హాజరు లేకపోతే సదరు తరగతిని మూసివేస్తారు. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువైతే పాఠశాలను సైతం మూసేస్తారు. వేసవికాలం వస్తే ఇదివరకు ఉపాధ్యాయుల హాయిగా వేసవి శెలవులు ఎంజాయ్ చేసేవారు.

కానీ ఇప్పుడలా కాదు. వేసవి కాలం వచ్చిందంటే స్కూలు బస్సులు ఎక్కి ఊరూరా తిరుగుతూ తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే ఫ్రాన్సు దేశంలో ఓ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో క్లాసులను సస్పెండ్ చేస్తారన్న భయంతో సదరు క్లాస్ టీచర్ ఏకంగా గొఱ్ఱెలను చేర్చుకున్నారు. అంతేకాదు... వాటికి పేర్లు కూడా పెట్టి రిజిస్టర్లో ఎంటర్ చేశారు. క్లాసులు మొదలవుతాయనగానే సుమారు 15 గొఱ్ఱెలను తోలుకుని వాటి యజమాని వస్తాడు. హాజరు చెప్పడం పూర్తయ్యాక ఆ గొఱ్ఱెలను తోలుకుని వెళ్లిపోతాడు. ఈ వ్యవహారం అక్కడి పైఅధికారులకు తెలియడంతో దర్యాప్తుకు ఆదేశించారు.