గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 28 మార్చి 2019 (19:12 IST)

తస్మాత్ జాగ్రత్త... జనం పైకి రూ.200 నకిలీ నోట్లు...

ఎన్నికల వేళ నకిలీ నోట్లు వచ్చేశాయి. ఉత్తరాదిన థానేలో రూ. 200 నకిలీ నోటు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను చెల్లించేందుకు ఓ వ్యక్తి గ్రామ పంచాయతీకి వెళ్లగా దానిని పరిశీలించిన అధికారి అది నకిలీ నోటని చెప్పారు. 
 
ఈ నోటుపై గాంధీజీ వాటర్ మార్క్ లేదు. అలాగే పచ్చగా వుండే ఆర్బీఐ నిలువు గీతలు లేవు. అంతేకాకుండా మామూలు 200 నోటు కంటే 2 మి.మిటర్లు తక్కువ సైజులో వుంది. ఈ నోటును చూసినవారంతా ఎన్నికల వేళ నకిలీ నోట్లు రంగంలోకి వచ్చేశాయని చెప్పుకుంటున్నారు. మరి మీ చేతికి వస్తున్న నోట్లను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి మరి.