మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (18:29 IST)

దేశంలో అత్యధికంగా ఏపీలో రూ.62.29 కోట్లు సీజ్..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మద్యం, నగదు ఏరులై పారుతోంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ప్రకటించగా, అదే రోజున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా నగదు, మద్యం ఏరులై పారుతోంది. 
 
ఎన్నికల వేళ యూపీలో అత్యధికంగా రూ.24.50 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోగా... కర్ణాటకలో రూ.20.45 కోట్లు, ఏపీలో రూ.17.13 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర ప్రాంతాల్లో ఏకంగా 613.17 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.104.49 కోట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు సమాచారం. 
 
అత్యధికంగా మొదటి విడతలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న ఏపీలో రూ.62.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో రూ.49.48 కోట్ల నగదును సీజ్ చేశారు.