గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (13:32 IST)

ఒక్క ఓటు కోసం.. 35 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రం..

ఓటు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఒక్క ఓటుతో ఓడిపోయిన వారు ఎంతోమంది వున్నారు.  ప్రభుత్వాలే ఒక్క ఓటు వల్ల మారిపోతాయి. అందుకే ఒక్క ఓటు ప్రాధాన్యతను గుర్తించిన ఈసీ.. ఒక్క ఓటు ఉన్నా.. రెండు ఓట్లు ఉన్నా.. అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 
 
ఇందులో భాగంగా గుజరాత్‌లోని గిర్ అడవిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఒకే ఒక్కడి కోసం ఏర్పాటు చేసింది. ఆసియా సింహాలు మస్తుగా వుండే ఈ అడవిలో 35 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది ఈసీ. ఒక్కడి కోసం ఐదుగురు ఎన్నికల సిబ్బంది, ఇద్దరు ఫారెస్ట్ గార్డులు అడవిలోకి వెళ్లనున్నారు. 
 
ఆ ఒక్క ఓటు వేసే వ్యక్తి ఎవరో తెలుసా..? మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి. గిర్ అడవి మధ్యలో బనేజ్ తీర్థం అనే శివుడి గుడి ఉందట. ఆ గుడిలోని పూజారే ఈ భరత్‌దాస్. ఆయన ఆ గుడిలోనే నివాసం ఉంటాడు. అది జునాగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 
 
నిజానికి భరత్‌దాస్ ఓటేయాలంటే 35 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దీంతో ఎన్నికల సంఘం గుడిలోనే ఆయన కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భరత్ దాస్ ఓటేయగానే.. ఎన్నికల సిబ్బంది అక్కడి నుంచి తట్టా బుట్టా సర్దేసుకుంటుంది. భరత్ దాస్ ఈసారే కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని ఈసీ ఏర్పాటు చేయలేదు. గడిచిన నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో భరత్ దాస్ కోసం గుడిలోనే ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.