శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (12:29 IST)

అగ్రకుల అమ్మాయితో అఫైర్.. చెట్టుకు కట్టేసి చితకబాదారు..

గుజరాత్‌లో ఘోరం జరిగింది. అగ్రకుల అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ కుర్రాడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, హసాన పట్టణ సమీపంలోని దినోజ్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు స్కూల్‌ ముందు వేచి ఉండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. 
 
ఆపై చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. శరీరంపై గాయాలు చూసిన బాధితుడి తల్లి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు