తుఫానులా గ్రామంపైకి దూసుకువచ్చిన మంచు.. (వీడియో)

snowfall
మోహన్| Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (13:17 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో భారీ స్థాయిలో హిమపాతం కురిసింది. లాహౌల్, స్పిటీ జిల్లాలోని టాండీ గ్రామంపై మంచు చరియలు విరుచుకుపడ్డాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రభుత్వం పేర్కొంది.

విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేసారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొడిమంచు సునామీలా గ్రామంవైపు దూసుకొస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూడండి మరి.
దీనిపై మరింత చదవండి :