మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (10:40 IST)

'మత్తు'లో మా రాష్ట్ర యువత : హిమాచల్‌ప్రదేశ్ సీఎం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడి

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
 
పోలీసు హాఫ్ మారథాన్ 2018 కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతో అధికారులు డ్రగ్స్ నివారణకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నివారించడానికి అందరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
డ్రగ్స్ కేసుల్లో దోషులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్‌ను తయారు చేయాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్ఆర్ మర్దీ వెల్లడించారు.