గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (09:12 IST)

ఆ పని చేసిందనీ... మహిళ కురులు కత్తిరించి.. వివస్త్రను చేశారు..

ఒడిషా రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ గ్రామంలో పలువురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని ఆరోపిస్తూ కొందరు యువకులు మహిళపై అమానుషంగా దాడిచేశారు.

ఒడిషా రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ గ్రామంలో పలువురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని ఆరోపిస్తూ కొందరు యువకులు మహిళపై అమానుషంగా దాడిచేశారు. ఈ దాడిలో భాగంగా, ఆమె వెంట్రుకలు కత్తిరించి.. వివస్త్రను చేసి చితకబాదారు. దీంతో ఆమె మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా రాష్ట్రంలోని బొలంగీర్ జిల్లా లొహసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరెకొచియా గ్రామానికి చెందిన ఓ వివాహిత గ్రామంలో పలువురు పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు కొందరు యువకులు ఆరోపిస్తూ, ఆమెపై చేయి చేసుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆమె గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో దాడికి పాల్పడిన వారిని పంచాయతీకి పిలిచిన గ్రామపెద్దలు మందలించి పంపారు. తమను పంచాయతీలో నిలబెట్టిందని ఆమెపై కక్ష పెంచుకున్న ఆ యవకులు.. ఒంటరిగా వెళ్తున్న ఆమెపై అందరూ కలిసి దాడిచేసి నిర్బంధించారు. 
 
అనంతరం ఆమె కురులు కత్తిరించి వివస్త్రను చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా పోలీసులు స్పందన లేకపోవడంతో సోమవారం ఆమె విలేకరుల ఎదుట తనకు జరిగిన అవమానం గురించి చెబుతూ విలపించింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పడం గమనార్హం.