సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (16:40 IST)

కొవ్వు పదార్థాలు... అమ్మాయిల బ్రెస్ట్ సైజుల్లో పెరుగుదల : సర్వేలు

అమ్మాయిల ఎద ఆకృతులు (బ్రెస్ట్ సైజులు) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 యేళ్ళ లోపు యువతుల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలు బ్రాలు తయారీ కంపెనీలు వెల్లడించాయి. సహజంగా స్త్రీ

అమ్మాయిల ఎద ఆకృతులు (బ్రెస్ట్ సైజులు) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 యేళ్ళ లోపు యువతుల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలు బ్రాలు తయారీ కంపెనీలు వెల్లడించాయి. సహజంగా స్త్రీలు వాడే "బి" బ్రా సైజుకు బదులు ఇప్పుడు డిడి సైజులు ఎక్కువగా వాడుతున్నట్లు ఈ కంపెనీలు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇది గత 20 ఏళ్ల కాలంలో చోటుచేసుకున్న పరిణామంగా వారు అభివర్ణిస్తున్నారు. 
 
దీనికి కారణాలేమిటో వారు చెప్పలేకపోయినా ఆరోగ్య నిపుణులు మాత్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అసలు విషయాన్ని కనుగొన్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు, ఆహారపుటలవాట్ల మూలంగా స్త్రీలలో హార్మోన్లకు సంబంధించి గణనీయమైన తేడాలు చోటుచేసుకున్నట్లు తమ పరిశోధనలో తేలిందంటున్నారు. ఫలితంగా వారు ధరిస్తున్న బ్రాలతో పాటు లింగరీ సైజుల్లో కూడా తేడాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నట్లు వెల్లడించారు. 
 
చాలామంది టీనేజ్ ఆడపిల్లలు తమకు ఆకర్షణీయమైన ఎద సంపద లేకపోతే అల్లాడిపోయే మనస్తత్వం కలిగి ఉండటాన్ని తాము గమనించామని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎలాగైనా వక్ష సంపదను పెంచుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పలు మార్గాలను అవలంభించడం కూడా ఇందుకు కారణమవుతోందంటున్నారు. 
 
మరికొంతమంది అమ్మాయిలు తమ ఎద సైజులతోపాటు పిరుదుల సైజులను పెంచుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనీ, అందుకోసం ప్రత్యేకమైన వ్యాయామాలను సైతం ఆచరిస్తున్నారని వెల్లడించారు. దీంతో బ్రా, లింగరీ సైజుల్లో భారీ తేడాలు చోటుచేసుకుంటున్నాయని చెపుతున్నారు. 
 
అయితే పెరిగిపోతున్న వక్షోజ ఆకృతులకు ఆహారటపులవాట్లకు సంబంధమున్నదని అంటున్నారు. కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం ఒక కారణమయితే, శరీరానికి పని చెప్పకుండా ఉండటం మరో కారణమంటున్నారు. వీటి ఫలితంగా టీనేజ్ వయసుకు చేరుకునే పిల్లల్లో వయసుకు మించిన శరీరపు సంపద వచ్చి చేరుతోందని అంటున్నారు.