మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (16:09 IST)

తలగడ కింద దేవుళ్ల ఫోటోలు పెడుతున్నారా? వద్దు బాబోయ్..

తలగడ కింద దేవుళ్ల ఫోటోలు పెడుతున్నారా.. వద్దే వద్దు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. మంచం ఎప్పుడూ.. యోగ, భోగ స్థానానికి గుర్తు. అందుచేత మంచంపై దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు, పుస్తకాలు వుంచకూడదు. పసుపు

తలగడ కింద దేవుళ్ల ఫోటోలు పెడుతున్నారా.. వద్దే వద్దు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. మంచం ఎప్పుడూ.. యోగ, భోగ స్థానానికి గుర్తు. అందుచేత మంచంపై దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు, పుస్తకాలు వుంచకూడదు.


పసుపు కుంకుమ, పూజా సామాను తమలపాకులు, పువ్వులు, పండ్లు, దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న వస్తువులు, పదార్థాలు మంచంపై వుంచకూడదట. భోగస్థానం అయిన మంచంపై ఇలాంటివి పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట నిలవదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఐశ్వర్యం నిలవదు. 
 
తలగడ క్రింద దేవుడి పటాలను వుంచుకుని.. పొద్దున్నే లేవగానే వాటిని కళ్ళకు అద్దుకోవడం వంటివి చేయకూడదు. మంచం మీద దేవుడికి సంబంధించిన పుస్తకాలను గాని, ఫోటోలను గాని ఎత్తి పరిస్థితుల్లో పెట్టకూడదు. అలాగే ఉతికిన దుస్తులను మంచంపై వేసి వుంచి ఆపై మడతపెట్టి అలమరాల్లో పెట్టడం చాలామంది చేస్తుంటారు. 
 
అలా ఉతికిన బట్టలను కూడా మంచంపై వేయకూడదని.. వాటిని స్నానం చేసిన తర్వాత ధరించి.. పూజలు చేయడం ద్వారా ఫలితం వుండదని.. అందుకే ఉతికిన దుస్తులను కుర్చీలపై వేసి మడత పెట్టి.. అలమరాల్లో వుంచాలి. ఇలా చేయడం ద్వారా శుచిగా దేవునికి పూజ చేసినట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.