సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : బుధవారం, 30 మే 2018 (13:03 IST)

దేవుడిని సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడుతున్నారా?

దేవునికి సమర్పించే నివేదన పట్ల మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవంతని ప్రసాదమే కాబట్టి వీటిని ముందుగా దేవునికి సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ప్రక్రియకొక మంచి లక్షణం. మనుషులలో రెండు

దేవునికి సమర్పించే నివేదన పట్ల మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవంతని ప్రసాదమే కాబట్టి వీటిని ముందుగా దేవునికి సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ప్రక్రియకొక మంచి లక్షణం. మనుషులలో రెండురకాల తత్త్వాలు గలవారు ఉంటారు. దేవుని పట్ల పెద్దగా విశ్వాసం లేని వారు, నాస్తికభావాలు గలవారు ఒకరు.
 
ప్రతి విషయంలోనూ భగవంతునికి నమ్మే ఆస్తికత్వం గలవారు కొందరు. ఇద్దరి కోరికలను తీర్చేవాడు భగవంతుడే. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు గ్రహించి, తనకు లభించిన వాటిని భగవంతుని, ఇతరులకు అర్పించే వారంటే శ్రీమన్ నారాయణునికి వల్లమాలిన ప్రీతి. ఇటువంటి వారికి సంపదల్ని, విజయాల్ని సిద్ధింపజేస్తారు.
 
భగవంతునికి సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని దేవునిదిగా స్వీకరించి ఆహారంగా తీసుకోవాలి. ఇలా దేవునికి నైవేద్యం సమర్పించడం అస్తికుల లక్షణం. అందుచేత భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతగా ఉంటాలి. 
 
దేవునికి నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రలలోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. వేడిగా ఉన్న పదార్దాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లటి పదార్థాలు కూడా నైవేధ్యానికి పెట్టకూడదు. గోరువెచ్చటి పదార్థాలను దేవుడికి నైవేధ్యంగా పెట్టాలి.
 
నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్ళను చల్లుతూ ఉండాలి. బయట కొన్న వంటకాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే నిలవ ఉన్నవి, పులిసిపోయిన పదార్థాల్ని నైవేద్యానికి పనికిరావు. నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతినివ్వాలి. నైవేద్యం పెట్టిన తరువాత 5 నిముషాలు అలాగే వదిలేసి పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.
 
నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లుగా చూసుకోవాలి. నైవేద్యం పెట్టే సమయంలో ఆహారపదార్థాలను చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.