శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (16:31 IST)

''శ్రీనివాస కల్యాణం'' అక్కడ జరుగుతోంది...

నితిన్, రాశిఖన్నా జంటగా, దిల్‌రాజు నిర్మాతగా, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించే సినిమా ''శ్రీనివాస కల్యాణం''. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ అందమైన ఇంటి సెట్లో శ్రీనివాస కల్యాణం షూట

నితిన్, రాశిఖన్నా జంటగా, దిల్‌రాజు నిర్మాతగా, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించే సినిమా ''శ్రీనివాస కల్యాణం''. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ అందమైన ఇంటి సెట్లో శ్రీనివాస కల్యాణం షూటింగ్ జరుగుతోంది. ఇంటిల్లిపాది కలిసి పాడుకునే పాటను ఈ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు ఈ పాట హైలైట్ అవుతుందని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
ఈ పాట షూటింగ్ విరామ సమయంలో ఆర్టిస్టులంతా కలిసి సరదాగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బట్టి ''శతమానం భవతి'' తరహాలోనే ఇది కూడా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనుందని అర్థమవుతోంది. 
 
ఈ సినిమాలో నందిత శ్వేత రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, గిరిబాబు, జయసుధ, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ పనులు ముగించుకుని ఆగస్టు తొమ్మిదో తేదీన విడుదల కానుంది.