శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By మోహన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (15:26 IST)

ప్రకాశ్ రాజ్‌కి 3 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నాయ్.. జగన్ ఫిర్యాదు

నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్‌కి నాలుగు ఓట్లు ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన జగన్ కుమార్ అనే సామాజిక వేత్త కర్ణాటక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ప్రకాశ్ రాజ్‌కు మూడు రాష్ట్రాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయని, అది చట్టరీత్యా నేరం అంటూనే ఇందుకు ఒక్క సంవత్సరం జైలు శిక్ష కూడా వెయ్యవచ్చునని సామాజిక వేత్త జగన్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం అతని అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలని జగన్ కుమార్ కోరుతున్నారు.
 
ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరులో ఒక ఓటు.. తమిళనాడులోని వేలచ్చేరిలో రెండు ఓట్లు.. తెలంగాణలోని శేర్‌లింగంపల్లిలో ఒక ఓటు ఉందని, అలాగే ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓట్లు యాక్టీవ్‌గా ఉన్నాయని, ఇది చట్టంలోని సెక్షన్ 17,18 మరియు సెక్షన్ 31లను ఉల్లంఘించడమే అని జగన్ కూమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.
 
ప్రకాశ్ రాజ్‌ ఓట్లకు సంబంధించిన కార్డుల కాపీలను కూడా జగన్ కుమార్ తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. వెంటనే ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలని జగన్ కుమార్ ఎన్నికల సంఘాన్ని కోరారు.