గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:01 IST)

పార్టీ ముగిసింది.. కారెక్కించుకున్నాడు.. మహిళా సైనికాధికారిపై వేధింపులు..

బెంగళూరులో ఓ మహిళా సైనికాధికారి లైంగిక వేధింపులకు గురైంది. మహిళా సైనికాధికారికి వేధింపులు.. మేజర్ వద్ద విచారణ జరుగుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది.


ఆ వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఎఎస్‌సీ కేంద్రంలో మార్చి నెల 4వ తేదీ ఓ సైనికాధికారి రిటైర్మెంట్ కోసం రాత్రి పార్టీ జరిగింది. ఆ పార్టీ ముగిసిన తర్వాత మేజర్ అమిత్ చౌదరి తనతో పనిచేసే 29ఏళ్ల మహిళా అధికారిని ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. 
 
అసలే పార్టీ.. ఇక చుక్కేసిన అమిత్ చౌదరి.. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో కారును ఆపాడు. తనతో పాటు కారులో వచ్చిన మహిళా సైనికాధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు వెల్లడిస్తే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటనపై బాధిత మహిళా సైనికాధికారి తమ ఉన్నతాధికారి అయిన మేజర్ వద్ద ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది.