శారీరక శ్రమతో మానసిక స్థితి మెరుగు
చాలామంది చిన్న విషయం జరిగినా అతిగా ఆలోచన చేస్తుంటారు. ఇలా అతిగా ఆలోచన చేయడం వల్ల మానసికస్థితి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఉంటున్నారు. అప్పటివరకూ సంతోషంగా ఉన్నవారు వెంటనే ఏదో కోల్పోయిన వారిలా మారిపోతారు. అలాంటప్పుడు శారీరక శ్రమతో మానసిక స్థితి మెరుగు పరుచుకోవచ్చని వారు చెబుతున్నారు.
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న దాదాపు 50 మందికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను ఒక ట్రాకర్ సాయంతో నిశితంగా పరిశీలించారు. వీరు రోజులో ఎక్కువ సమయం శారీరక శ్రమ చేయడం వల్ల మానసికపరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అదేపనిగా చదివే వారు కూడా మానసికఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేసేవారు పని ఒత్తిడి కారణంగా మెంటల్ స్ట్రెస్‌కి గురవుతుంటారు. కొంతమంది తాము అనుకున్నపని సాధించలేకపోయినా కూడా మానసికంగా కుంగిపోతుంటారు. వీళ్లంతా శారీరకంగా ఎంత కష్ట పడితే అంత మేలు. అందుకే రోజూ కొంతైనా శ్రమిస్తే అది మీకే మేలు నిపుణులు సలహా ఇస్తున్నారు.