మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (13:58 IST)

గ్రీన్ కాఫీ ఎక్కువగా తీసుకుంటే?

గ్రీన్ కాఫీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజానాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ కాఫీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా స్థూలకాయాన్ని అదుపులో ఉంచేందుకు మంచిగా దోహదపడుతు

గ్రీన్ కాఫీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజానాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ కాఫీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా స్థూలకాయాన్ని అదుపులో ఉంచేందుకు మంచిగా దోహదపడుతుంది. గ్రీన్ కాఫీ గింజల్లో కెల్ప్ అనే రసాయనం అధిక మోతాదులో ఉంటుంది.

 
కెల్ప్ అనే ఈ రసాయనం శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా కరిగించగలదని పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా కెల్ప్ అనే ఈ పదార్థం సముద్రపు నాచులో ఎక్కువగా ఉంటుంది. ఈ కెల్ప్ అనే పదార్థాం గ్రీన్ కాఫీ గింజల్లో కూడా ఉండడం వలన దీనిని వినియోగించడం తేలికేనని నిపుణులు తెలియజేశారు. కాని గ్రీన్ కాఫీలో ఆకలిని తగ్గించే లక్షణం కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ గ్రీన్ టీను తీసుకోకుండా జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్నున్నారు.