గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 31 మే 2018 (12:19 IST)

జనపనార విత్తనాలు తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టేయచ్చు...

జనపనార విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగిఉంటాయి. ఇది మన శరీరానికి కావలసిన సుమారు ఇరవై అమినో అమ్లాలను కలిగిఉంటుంది. అంతేకాకుండా అనేక ఇతర గింజలలోని ఫైబర్‌ను కలిగిఉంటుంది. వీటితో పాటు శరీరానికి కావల

జనపనార విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగిఉంటాయి. ఇది మన శరీరానికి కావలసిన సుమారు ఇరవై అమినో అమ్లాలను కలిగిఉంటుంది. అంతేకాకుండా అనేక ఇతర గింజలలోని ఫైబర్‌ను కలిగిఉంటుంది. వీటితో పాటు శరీరానికి కావలసిన అమోఘమైన మినరల్స్‌ను కలిగిఉంటుంది. మధుమేహంతో బాధపడేవారికి ఈ విత్తానాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. 
 
జనపనార విత్తనాలలో మెదడుకు, గుండె ఆరోగ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తసరఫరా వ్యవస్థను క్రమబద్దీకరిచడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. వీటిలో శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. ఇది కండరాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తాయి. జనపనార విత్తనాలు ఉదర ఆరోగ్యాని పెంచుతాయి.
 
ఈ విత్తనాలు జీవక్రియలను సరిగ్గా కొనసాగేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో హానికర వ్యర్ధాలను బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ, అమినో అమ్లాలు మీ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ విత్తనాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని అనేక ప్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది. అనేక రకాలైన అనారోగ్యా సమస్యల నుండి కాపాడుతుంది.
 
అంతేకాకుండా అధిక ఒత్తిడిని, మతిమరుపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. లివర్‌ను ఆరోగ్యవంతంగా తయారుచేస్తాయి. థైరాయిడ్ సమస్యలను కూడా తగ్గించే గుణాలు ఈ జనపనార విత్తనాలలో ఉన్నాయి.