శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 30 మే 2018 (10:14 IST)

ఆకుకూరలు తీసుకుంటే రక్తహీనతకు?

ఆకుకూరలలో శరీరానికి కావలసిన రకరకాల ఖనిజలవాణాలు, విటమిన్స్, ప్రోటీన్స్ ఇందులో ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూరలలో కొవ్వు తక్కువుగా ఉండడం వల్ల ఆహారానికి రుచికరంగా చేసే ప్రత్యే

ఆకుకూరలలో శరీరానికి కావలసిన రకరకాల ఖనిజలవాణాలు, విటమిన్స్, ప్రోటీన్స్ ఇందులో ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూరలలో కొవ్వు తక్కువుగా ఉండడం వల్ల ఆహారానికి రుచికరంగా చేసే ప్రత్యేక లక్షణం వీటికుంది. వీటిని వండుకునే ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకుంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చును.
 
శరీర పెరుగుదలకు, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నట్లైతే చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చును. ఈ ఆకుకూరలలో చాలా రకాలున్నాయి. పాలకూర, గొంగూర, తోటకూర, మెంతికూర, బచ్చనికూర, చుక్కకూర, మునగాకు, క్యాబేజి, కాలిఫ్లవర్, పొన్నగంటికూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీన వీటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
పాలకూరలో కాల్షియం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఎముకల సాంద్రతకు బాగా ఉపయోగపడుతుంది. చుక్కకూరలో విటమిన్ ఎ, మెగ్నిషియం ఎక్కువగా ఉండడం వలన గుండె సమస్యలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. గోంగూరను తీసుకుంటే కంటి వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చును. తోటకూరలో యాంటి ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ ద్వారా రక్తహీనతను నివారిస్తుంది. రక్తకణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
 
బచ్చలికూరలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పొన్నగంటికూరను తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గించి, క్రిములను నాశనం చేస్తుంది. మునగాకులో ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది. కొత్తిమీర ఆరోగ్యవంతమైన కణాలకోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
 
కరివేపాకులో బయోటిక్ వల్ల జుట్టు సంరక్షణకు, అరుగుదలకు ఉపయోగపడుతుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన శరీర వేడిని తగ్గిస్తుంది. మెంతికూరలో పీచుపదార్థ ఎక్కువగా ఉండడం వలన మధుమేహం, గుండె ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలను పప్పులలో వేసి తీసుకోవడం వలన పోషకపదార్ధాలు లభించి ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
 
ఆకుకూరలను బాగా శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. పిల్లలకు ఆకుకూరలు తినిపించేటప్పుడు కవ్వంతో బాగా మెదిపి అన్నంలో కలిపిపెట్టాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదు. ఉడికించిన నీటిని సూప్‌లా తీసుకుంటే చాలా మంచిది.