సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 30 మే 2018 (13:02 IST)

విటమిన్ 'ఇ' వున్న ఆహారపదార్థాలు తీసుకుంటే?

బ్రిటీష్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో కాలుష్యం వలన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న వాహనాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అందువలన ఊపిరితిత్తులను కాపాడుకోవాడానికి విటమిన్ ఇ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని వె

బ్రిటీష్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో కాలుష్యం వలన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న వాహనాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అందువలన ఊపిరితిత్తులను కాపాడుకోవాడానికి విటమిన్ ఇ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని వెల్లడించారు. 
 
విటమిన్ ఇ గల ఆహార పదార్థాలు ఆలివ్ ఆయిల్‌, బాదంపప్పు, సన్ ఫ్లవర్ గింజలు ఇలాంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. వీటిని అధికంగా తీసుకునేవారిలో ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యలను చాలావరకు తొలగిపోతాయి. రొయ్యలు, చేపలు, బ్రొకోలీ వీటిల్లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.
 
పాలకూరలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా చేయుటకు ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులకు, క్యాన్సర్‌కు ఎంతో మేలుచేస్తుంది. దీనివలన మతిమరుపు వంటి సమస్యలు తొలగిపోతాయి. విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది.