ప్రకాష్ రాజ్ ఆస్తులు ఎంతో తెలుసా?

prakash raj
Last Updated: సోమవారం, 25 మార్చి 2019 (11:59 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఆయన ఆస్తుల విలువను మొత్తం రూ.31 కోట్లుగా వెల్లడించారు. ఇందులో రూ.26.59 కోట్ల స్థిరాస్తులు కాగా, రూ.4.93 కోట్ల చరాస్తులుగా ఉన్నాయి. అలాగే, పెట్టుబడి రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని ప్రకాశ్ తెలిపారు.

ఇకపోతే, గత యేడాది సినిమాల ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం సమకూరగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేలు ఉన్నట్టు తెలిపారు. వీటితో పాటు.. రూ.1.88 కోట్ల విలువ చేసే వాహనాలు, భార్య రష్మి వర్మ పేరిట రూ.20.46 లక్షల చరాస్తి, రూ.35 లక్షల స్థిరాస్తి.. రూ.18 లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని ప్రకాష్ రాజ్ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :