గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (14:57 IST)

మనిద్దరి మధ్య పాప ఎందుకు.. కొట్టి చంపేద్దాం.. ప్రియుడి మాట విని?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో చిన్నారులను పొట్టనబెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ప్రియుడి మోజులో పడిన ఓ యువతి కిరాతకురాలిగా మారిపోయింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని కన్నకుతూరును కిరాతకంగా చంపేసింది.


ఆపై ఏమి తెలియనట్లు డ్రామా చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ రాక్షసి బండారం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లాలోని వానియంబాడికి చెందిన నళిని (26)కి  బెంగళూరుకు చెందిన శివకుమార్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు జీవిత్ (6), జస్వంత్(5)తో పాటు ఏడాదిన్నర వయస్సున్న రిత్విక అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం నళిని వాణియంబాడిలో తల్లి వద్ద వుంటోంది. 
 
ఇంతలో చెన్నైకి చెందిన మురళి అనే వ్యక్తితో నళినికి ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం రిత్విక అనారోగ్యం పాలయింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. 
 
అయితే పాప శరీరంపై గాయాలు ఉండటాన్ని గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిన్నారి మరణంపై విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ప్రియుడు మోజులో పడి... మురళి పాప వద్దన్నాడని చెప్పింది.

ఇంకా అతనితో కలిసి చెన్నైకి వెళ్లి కొత్త జీవితం మొదలెడతాం అనుకుంది. అందుకే పాపను కొట్టి చంపేసినట్లు నళిని తెలిపింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.